: టీడీపీలో ఓ మర్యాద, గౌరవం లేవు... అందుకే, బయటకు వచ్చా: శిల్పా మోహన్ రెడ్డి
తెలుగుదేశం పార్టీలో ఓ మర్యాద, గౌరవం లేవని, తనను పట్టించుకోలేదని నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ తరపున బరిలోకి దిగుతున్న శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, టీడీపీలో అలసత్వ ధోరణి, తనకు తక్కువ ప్రాముఖ్యత నివ్వడం.. వంటి కారణాలతో తాను విసిగిపోయానని అన్నారు.
అంతేతప్ప, తనకు పదవులు ఇవ్వలేదనో, సీట్లు ఇవ్వలేదనో టీడీపీ నుంచి వైసీపీలోకి రాలేదని అన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరినప్పుడు తాను చాలా మధనపడ్డానని, తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీ మారాల్సి వచ్చిందని అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా మొదట్లో ఓ పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత మరో పార్టీలోకి వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.