: చెర్రీకో, ప్రభాస్ కో కథ చెబుతా... ఆ తర్వాత ఇక 'లైఫ్ సెటిల్' అంటున్న ‘అల్లరి’ నరేష్!


ప్రజిత్ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేష్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మేడ మీద అబ్బాయి’. ఈ చిత్ర టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘అల్లరి’ నరేష్ ఈ టీజర్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ఈసారి ‘మేడమీద అబ్బాయి’గా మీ ముందుకు వస్తున్నాను. అధికారికంగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ను చూడండి’ అని నరేష్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఇక, ఆ టీజర్ గురించి చెప్పాలంటే..‘రెండుమూడు కథలు ఉన్నాయి రా, మంచి ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏ చెర్రీకో, ప్రభాస్ కో కథ చెబుదాం. ఆ తర్వాత డైరెక్షన్, డబ్బుకు డబ్బు.. లైఫ్ సెటిల్.. ఆ అమ్మాయి ఆల్ రెడీ ఒకరిని లవ్ చేస్తోంది... ఈ టీజర్ చూసి రామ్ గోపాల్ వర్మ ఏం కామెంట్ పెడతాడబ్బా!’ అని ఆ టీజర్ లో ‘అల్లరి’ నరేష్ అంటాడు. కాగా, ఈ సినిమాలో నరేష్ సరసన హీరోయిన్ నిఖిల నటిస్తోంది. శ్రీనివాస్ అవసరాల, రాజేష్ ‘జబర్ దస్త్’ ఆది తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి షాన్ రెహమాన్ సంగీతం అందించారు.

  • Loading...

More Telugu News