: చిదంబరం కుమారుడిపై సీబీఐ లుకౌట్ నోటీసు


కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి ఆయన వెళ్లకుండా ఉండేందుకు ఈ మేరకు సర్క్యులర్ ను విడుదల చేసింది. కార్తీ అవినీతి ఆరోపణలపై విచారణ కొనసాగుతున్న తరుణంలో ఆయన విదేశీ టూర్లకు ప్లాన్ చేస్తున్నారని... దీంతో, ఆయన దేశం విడిచి వెళ్లిపోతారేమో అనే ఆందోళన తమకు ఉందని... తాము అనుమతి ఇచ్చాకే ఆయన విదేశాలకు వెళ్లేలా కోరుతూ, లుకౌట్ నోటీసులు జారీ చేస్తామని ప్రభుత్వానికి సీబీఐ తెలిపింది. ఈ మేరకే నోటీసులు జారీ చేసింది. మరోవైపు, ఈ నోటీసులను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో కార్తీ పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News