: నా భర్తను చంపించింది జగన్, ఆయన తండ్రి కాదా?: పరిటాల సునీత విమర్శ
జగన్ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని, కాల్చి చంపడమే ఆయన సంస్కృతి అని, ఆ సంస్కృతే తన భర్త పరిటాల రవిని హత్య చేయించిందంటూ ఏపీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘నా భర్త పరిటాల రవిని హత్య చేయించింది జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాదా? నా భర్తతో పాటు ఎందరినో పొట్టన పెట్టుకున్నారు. చంద్రబాబు హత్యా రాజకీయాలకు వ్యతిరేకం. చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు జగన్ నోరు అదుపులో పెట్టుకోవాలి’ అని సునీత అన్నారు.