: లోక్‌సభ స్పీకర్ చేతుల మీదుగా సిస్టర్4చేంజ్ వెబ్‌సైట్ ఆవిష్కరణ... కవిత ట్వీట్!
రాఖీ పండగ రోజు సోదరుడికి రాఖీతో పాటు హెల్మెట్‌ను కూడా బహుమతిగా ఇవ్వాలని తెరాస ఎంపీ కవిత ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలో భాగంగా రూపొందించిన సిస్టర్4చేంజ్.ఆర్గ్ వెబ్‌సైట్‌ను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఆవిష్కరించారు. ఇందుకు గాను ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కవిత ట్వీట్ చేశారు. `సిస్టర్4చేంజ్ ప్రచారంలోకి భాగంగా తమ మద్దతు తెలిపి, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించినందుకు కృతజ్ఞతలు` అని కవిత ట్వీట్‌లో పేర్కొన్నారు.