: పరిటాల శ్రీరామ్ కాబోయే భార్య ఈమే!


దివంగత పరిటాల రవి, మంత్రి పరిటాల సునీతల పెద్ద కుమారుడు శ్రీరామ్ వివాహం ఆలం జ్ఞానతో అక్టోబర్ 1వ తేదీన జరగనుంది. హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ నెల 10వ తేదీన నిశ్చితార్థ వేడుక జరగబోతోంది. అనంతపురం జిల్లా నార్పల మండలానికి చెందిన కాంట్రాక్టర్ ఆలం వెంకటరమణ, సుశీలమ్మ దంపతుల కుమార్తె జ్ఞాన. ఇప్పటికే నిశ్చితార్థ వేడుకకు అతిథులను ఆహ్వానించే పనిలో మంత్రి సునీత బిజీగా ఉన్నారు. నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి, ఆయనను ఆహ్వానించారు. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయే శ్రీరామ్ కు కాబోయే భార్య.

  • Loading...

More Telugu News