: జీతం రూ. 40 లక్షలు... అయినా కక్కుర్తితో అడ్డదారి తొక్కాడు!


ఆధార్ సర్వర్లలోకి జొరబడి, అందులోని సమాచారాన్ని తస్కరిస్తున్నాడన్న అభియోగాలపై ఐఐటీలో పీజీ చేసిన అభినవ్ శ్రీవాత్సవను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు విచారణలో అవాక్కయ్యే విషయాలు రాబట్టారు. ఓలా సంస్థలో టెక్కీగా పని చేస్తున్న అభినవ్ జీతం సాలీనా రూ. 40 లక్షలు. అయితే, భారీగా డబ్బు సంపాదించాలన్న దురుద్దేశంతో అడ్డదారులు తొక్కాడు. భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని దాచుకున్న యూఐడీఏఐ సర్వర్లలోకి జొరబడేలా ఓ యాప్ ను 'హస్యాసి' పేరిట అభివృద్ధి చేశాడు.

దీని సాయంతో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తూ, తనకు తెలిసిన సమాచారాన్ని ఆన్ లైన్ లో అమ్ముకుంటున్నాడు. తమ సర్వర్లలోని సమాచారం తస్కరణకు గురవుతోందని జనవరిలో ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సుమారు ఏడు నెలల విచారణ తరువాత అభినవ్ పట్టుబడటం గమనార్హం. గురువారం నాడు నిందితుడిని అరెస్ట్ చేసిన సీసీబీ అదనపు కమిషనర్ ఎస్.రవి ప్రస్తుతం అతన్నుంచి మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. 'హస్యాసి' తరహాలోనే ఇతను మరో ఐదు యాప్ లను తయారు చేసినట్టు కనుగొన్నారు.

  • Loading...

More Telugu News