: ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు... ఏమాత్రం ఆలస్యమైనా పెను ప్రమాదం


హైదరాబాదులో పెను ప్రమాదం తప్పింది. ఏమాత్రం ఆలస్యమైనా కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. హైదరాబాదులోని ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, వివిధ కళాశాల్లలో చదివే విద్యార్థులు, వివిధ ప్రాంతాలకు తరలే వ్యాపారులు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. అయితే విద్యానగర్ సమీపంలో ఒకే ట్రాక్‌ పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. అయితే డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్ పై రైళ్లు నిలిచిపోవడంతో వివిధ రైళ్లు ఆసల్యంగా నడిచాయి. ఈ భారీ తప్పిదానికి కారణమేంటని అధికారులు విచారిస్తున్నారు. 

  • Loading...

More Telugu News