: అద్భుతమైన సెంచరీలతో లంకను ఇబ్బందుల్లో పడేసిన పుజారా, రహనే!


కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాట్స్ మన్ అద్భుతమైన పోరాట పటిమ చూపించారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నా, బంతి మెలికలు తిరుగుతున్నా మొక్కవోని పట్టుదలతో క్రీజులో నిలదొక్కుకుని ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే సెంచరీలు చేయడం ఆకట్టుకుంటోంది. తొలి టెస్టులో పిచ్ ను బ్యాటింగ్ కు అనుకూలంగా తయారు చేయడంతో భారత బ్యాట్స్ మన్ చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతోనే ఓటమిపాలయ్యామని భావించిన లంకేయులు రెండో టెస్టుకు మాత్రం స్పిన్ పిచ్ ను తయారు చేశారు.

దీంతో పెరీరా, హెరాత్ కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకుంటున్నా పుజారా, రహానే ఏకాగ్రతను ఏమాత్రం దెబ్బతీయలేకపోయారు. దీంతో రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఆట ముగిసే సరికి పుజారా (128), రహానే (103) భారత్ ను పటిష్ఠస్థితిలో నిలబెట్టారు. దీంతో తొలి రోజు టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. పిచ్ స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండడంతో టీమిండియా ఇంకా ఎన్ని పరుగులు చేయనుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. 

  • Loading...

More Telugu News