: దేవేంద్ర ఝజారియా, సర్దార్ సింగ్‌లకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు!
పారాలింపిక్స్‌లో రెండు సార్లు స్వర్ణ పతకం సాధించిన దేవేంద్ర ఝజారియా, మాజీ హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్‌లకు దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును జాతీయ క్రీడా కమిటీ ప్రకటించింది. దీంతో ఈ అవార్డు అందుకోనున్న మొదటి పారాలింపిక్ క్రీడాకారుడిగా దేవేంద్ర నిలవనున్నారు. ముందు ఈ అవార్డుకు దేవేంద్రను మాత్రమే జస్టిస్ సీకే థక్కర్ కమిటీ ఎంచుకుంది. సర్దార్ సింగ్‌ను రెండో నామినీగా తీసుకుంది. తర్వాత అవార్డును ఇద్దరికీ అందజేయాలని నిర్ణయించుకుంది. వీరి నిర్ణయానికి ఇంకా క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపాల్సి ఉంది.