: పరిటాల కుటుంబంలో పెళ్లి సందడి.. చంద్రబాబును ఆహ్వానించిన సునీత, శ్రీరామ్
పరిటాల కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. దివంగత పరిటాల రవి, మంత్రి సునీతల కుమారుడు శ్రీరామ్ వివాహం అక్టోబర్ 1న జరగనుంది. ఈ నెల 10వ తేదీన నిశ్చితార్థ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో నిశ్చితార్థ వేడుక జరుగుతుంది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలానికి చెందిన ఏవీఆర్ కన్ స్ట్రక్షన్ అధినేత ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె జ్ఞానతో శ్రీరామ్ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి కాల్వ శ్రీనివాసులుతో కలసి పరిటాల సునీత, శ్రీరామ్ లు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. నిశ్చితార్థ మహోత్సవానికి ఆహ్వానించారు.