: జాగృతిలో పని చేసినవారే ప్రభుత్వంపై కేసులు వేశారు.. మాకు సంబంధం లేదు!: కేసీఆర్ పై జానా ఫైర్


తెలంగాణ ప్రజలకు అప్పుడూ, ఇప్పుడూ విలన్ కాంగ్రెస్ పార్టీనే అంటూ ముఖ్యంత్రి కేసీఆర్ నిన్న ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజల పాలిట కాంగ్రెస్ పార్టీ పిశాచిలా, భూతంలా తయారైందని కేసీఆర్ మండిపడ్డారు. కేసుల రూపంలో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శాసనసభాపక్షనేత జానారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని జానా అన్నారు. సీఎం వాడుతున్న పదజాలాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని... ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకుంటున్నామని అన్నారు. ఇష్టానుసారం పాలన చేస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. కేసీఆర్ తన అసమర్థతను కాంగ్రెస్ పైకి నెట్టి, తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై కేసులు వేసినవారితో కాంగ్రెస్ కు సంబంధం లేదని... కడుపు మండినవారే కోర్టులకు వెళుతున్నారని చెప్పారు. గతంలో జాగృతిలో పనిచేసిన వారే కేసు వేశారని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ సహకరిస్తుందని... సింగరేణి కారుణ్య నియామకాలపై అసెంబ్లీలో మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News