: రవిశాస్త్రికి 'ఆల్ ది బెస్ట్' చెప్పిన గంగూలీ!


టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో ప్రపంచ కప్ ను టీమిండియా అందుకుంటుందనే ఆశాభావాన్ని క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, మాజీ కెప్టెన్ గంగూలీ వ్యక్తపరిచాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి మరింత రాటుదేలాలని సూచించిన గంగూలీ... అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. శాస్త్రి కోచింగ్ భారత జట్టును మరింత ముందుకు తీసుకెళుతుందని ఆశిస్తున్నట్టు తెలిపాడు. అయితే, ప్రస్తుతం ఉన్న భారత జట్టే అత్యుత్తమమైనది అంటూ, పదేపదే రవిశాస్త్రి చేస్తున్న కామెంట్లపై మాత్రం గంగూలీ స్పందించలేదు.

మరోవైపు తన కెప్టెన్సీలో సాధించిన కొన్న ఘనతల గురించి గంగూలీ గుర్తు చేసుకున్నాడు. 15 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ గడ్డపై సిరీస్ గెలుచుకున్నామని చెప్పాడు. 2007లో ఇంగ్లండ్ లో ఆ జట్టుపై విజయాన్ని సాధించామని తెలిపాడు. అయితే, ఆ విజయాలను రవిశాస్త్రి వ్యాఖ్యలతో పోల్చాల్సిన అవసరం లేదని చెప్పాడు.

  • Loading...

More Telugu News