: భారీగా అక్రమార్జనను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు


అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రికార్డు స్థాయిలో అక్రమార్జనను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదులో మున్సిపల్ ఏఈగా పనిచేస్తున్న కుప్పునాయక్ పై జనవరి 8న ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తాజాగా ఆయన బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిచారు. లాకర్లలో ఉన్న రూ.60 లక్షల నగదు, 40 తులాల బంగారం, రూ.40 లక్షల విలువ చేసే దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

  • Loading...

More Telugu News