: రేప్ తరువాత ఆ హీరోయిన్ షూటింగ్ కు ఎలా వెళ్లింది?: దిలీప్ కు మద్దతుగా ఎమ్మెల్యే జార్జి సంచలన వ్యాఖ్యలు


హీరోయిన్ భావన లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ మలయాళ స్టార్ హీరో దిలీప్ ను వెనకేసుకొస్తూ కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దిలీప్ కుట్రకు బలయ్యాడని ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం ‘అత్యాచారానికి గురైన మహిళ తర్వాత రోజు పనిలోకి ఎలా వెళ్లింది?’ అని ఆయన ప్రశ్నించారు.

‘పోలీసులు కోర్టులో చెప్పినట్లు ఆ నటిపై దారుణంగా అత్యాచారం జరిగి ఉంటే తర్వాత రోజు నటించడానికి ఎలా వెళ్లగలిగింది?’ అని అడిగారు. మలయాళ చిత్రపరిశ్రమ దిలీప్ కు మద్దతివ్వాలని ఆయన సూచించాడు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై సినీ రంగ మహిళా సంఘం స్పీకర్ ను కలిసి, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

  • Loading...

More Telugu News