: ఈ నెల 4న కృష్ణవంశీ ‘నక్షత్రం’ విడుదల
ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ రూపొందించిన మల్టీ స్టారర్ మూవీ ‘నక్షత్రం’ ఈ నెల 4న విడుదల కానుంది. ఈ విషయాన్ని ‘నక్షత్రం’ చిత్ర యూనిట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్, తనీష్, సాయి ధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాష్ రాజ్, శ్రియ, రఘుబాబు, తులసీ తదితరులు నటించారు.