: డ్రగ్స్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ కు తెలుగు చిత్రపరిశ్రమ లేఖ!


డ్రగ్స్ వ్యవహారంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారికి ఇటీవల నోటీసులు వెళ్లడం, సిట్ అధికారులు వారిని విచారించి పంపించడం తెలిసిందే. సుమారు పది రోజుల పాటు వారిని విచారించారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన వారిపై విమర్శలు గుప్పిస్తూ మీడియా, సామాజిక మాధ్యమాలు విరుచుకుపడటం విదితమే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కు తెలుగు చిత్ర పరిశ్రమ తాజాగా ఓ లేఖ రాసింది. ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని కోరింది. డ్రగ్స్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది.

సినీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని హుందాగా దర్యాప్తు కొనసాగించాలని కోరుకుంటున్నామని, తమ వంతు సహకారం అందిస్తామని ఆ లేఖలో పేర్కొంది. ‘డ్రగ్స్ సేవించే వారు మాకు ఎప్పటికీ హీరోలు కారు. కొందరు చేసిన పొరపాట్లకు చిత్రపరిశ్రమ తలదించుకునే పరిస్థితి రావడం బాధాకరం. వారిపై మేము క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి, పోలీసులకు పూర్తిగా సహకరిస్తాం, ప్రతి ఒక్కరూ సినిమా వాళ్ల మీద తీవ్రంగా స్పందించడం బాధించింది. సమాజం నుంచి మీడియా నుంచి సానుభూతి కావాలని కోరుకుంటున్నాం. సినీ పరిశ్రమకు ఈ పది రోజులు చీకటి రోజులు’ అని ఆ లేఖలో చిత్రపరిశ్రమ పేర్కొంది.

  • Loading...

More Telugu News