: అల్లు శిరీష్ ట్వీట్ కు స్పందించిన చంద్రబాబు!
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ట్వీట్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. వివరాల్లోకి వెళ్తే, ఉద్దానం కిడ్నీ బాధితుల శ్రేయస్సు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కృషిని ప్రశంసిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పట్ల స్పందించిన అల్లు శిరీష్... రాజకీయాలకంటే ప్రజా సంక్షేమానికే నాయకులు ఎక్కువ విలువ ఇస్తున్నారని... ఇది ఎంతో గొప్ప విషయమని... 'నేషన్ ఫస్ట్' అంటూ ట్వీట్ చేశాడు.
ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ ట్వీట్ కు చంద్రబాబు స్పందించారు. 'థాంక్యూ శిరీష్. చాలా గొప్పగా చెప్పావు. ప్రజలే ప్రధానం అనేదే మన మంత్రం. ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని ఇలాగే కొనసాగిస్తాం' అంటూ ట్వీట్ చేశారు. దీనికి అల్లు శిరీష్ మళ్లీ రిప్లై ఇచ్చాడు. తనకు రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.