: నాకు ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరైన దేవిశ్రీకి బర్త్ డే శుభాకాంక్షలు: మహేశ్ బాబు
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు హీరోలు, హీరోయిన్లు, ఇతర ప్రముఖులు ఆయనకు బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా దేవిశ్రీకి తమ శుభాకాంక్షలు తెలిపారు. ‘నాకు ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. భవిష్యత్తు అంతా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ప్రముఖ నటుడు మహేశ్ బాబు అన్నాడు.
‘మై సూపర్ రాక్ స్టార్ కు హ్యాపీ బర్త్ డే’ అని నటి శ్రియ, ‘హ్యాపీ బర్త్ డే రింగా రింగా. ఈ ఏడాది శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నా. చెప్పలేనంత ప్రేమతో’ అని దక్షిణాది ముద్దుగుమ్మ హన్సిక, ‘ఈ సంవత్సరం అద్భుతంగా, ఆనందంగా, ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని శ్రుతిహాసన్, ‘హ్యాపీ బర్త్ డే డియర్ డీఎస్పీ.. మా రాక్ స్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు- జైలవకుశ చిత్ర బృందం’ అని నందమూరి కల్యాణ్ రామ్, ‘ఈ ఏడాది సంగీత ప్రపంచాన్ని మరింతగా రాక్ చేయాలి’ అని హీరో నాని తదితరులు తమ శుభాకాంక్షలు దేవిశ్రీకి తెలిపారు.