: మొన్నటి వరల్డ్ కప్ కంటే.. 2005 వ‌రల్డ్ క‌ప్ నాకు ఎప్ప‌టికీ గుర్తుంటుంది: మిథాలీ రాజ్‌


భార‌త జ‌ట్టును 2017 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ వ‌ర‌కు తీసుకెళ్లిన ఆనందం కంటే 2005లో తాము ఫైన‌ల్స్‌కి చేరుకున్న సంఘ‌ట‌నే త‌న‌కు బాగా జ్ఞాప‌కం ఉంటుంద‌ని భార‌త మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపారు. ఫైన‌ల్లో కొద్ది తేడాతో క‌ప్ చేజార్చుకున్న త‌ర్వాత త‌న‌ భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల గురించి మిథాలీ మీడియాతో పంచుకున్నారు. `2005లో మా జ‌ట్టుకు ఎలాంటి స‌దుపాయాలు లేవు. బీసీసీఐ అండ కూడా లేదు. అయినా మేం బాగా ఆడి ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరాం. ఆస్ట్రేలియాతో 98 ప‌రుగుల తేడాతో మా మొద‌టి వ‌ర‌ల్డ్ క‌ప్ చేజార్చుకున్నాం` అని మిథాలీ చెప్పింది.

అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి, ఇప్పుడు 2017లో ఆస్ట్రేలియా జ‌ట్టును సెమీ ఫైన‌ల్‌లో చిత్తుగా ఓడించ‌డం ఒకింత ఆనందంగానే ఉంద‌ని మిథాలీ తెలిపింది. 2005 వ‌రల్డ్ క‌ప్‌తో పోల్చిన‌పుడు 2017 వ‌ర‌ల్డ్ క‌ప్ నాటికి ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింద‌ని, ఇప్పుడు బీసీసీఐ అండ ఉండ‌టంతో ఫైన‌ల్లో జ‌ట్టుపై ఒత్తిడి పెరిగి, ఆ కార‌ణంగా ఓడిపోవాల్సి వ‌చ్చింద‌ని మిథాలీ చెప్పింది. ప్ర‌స్తుతం తాను టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌తో పాటు మ‌రో రెండు అంత‌ర్జాతీయ టోర్నీల‌పై దృష్టి సారించిన‌ట్లు మిథాలీ తెలియ‌జేసింది.

  • Loading...

More Telugu News