: దిల్ షుక్ నగర్ సంస్థ ఘరానా మోసం... దేశం కాని దేశంలో బందీలుగా విద్యార్థులు!


హైదరాబాదులోని విద్యార్ధులను ఒక సంస్థ చేసిన ఘరానా మోసం వెలుగు చూసింది. దీంతో దేశం కానీ దేశంలో నిండా పరిపక్వత రాని వయసు విద్యార్థులు బందీలుగా మారారు. ఆడియన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ కళాశాలలో హోటల్ మేనేజ్ మెంట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో కళాశాల యాజమాన్యం, మాల్దీవుల్లో మంచి ఉద్యోగాలు వచ్చాయని చెబుతూ 17 మంది విద్యార్థుల నుంచి 1.1 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అనంతరం ఒక గత నెలలో విద్యార్థుల చేతుల్లో వీసా, అపాయింట్ మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టారు. మాల్దీవులు విద్యార్థులను తీసుకెళ్లిన యాజమాన్యం వారిని ఒక హోటల్ లో ఉంచి పత్తాలేకుండా పోయింది. దీంతో విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయని ఎన్నో ఆశలతో వెళ్లిన 17 మంది విద్యార్థులు హోటల్ రూం అద్దె చెల్లించలేదని దాని యజమాని వారి పాస్ పోర్టులు లాక్కుని వారందర్నీ ఒక గదిలో వేసి బంధించింది. దీంతో వారు తమను రక్షించాలని కోరుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News