: కొత్త గర్ల్ ఫ్రెండ్ రావడంతో, పాత గర్ల్ ఫ్రెండ్ ను ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచేశాడు!


కొత్త గర్ల్ ఫ్రెండ్ రావడంతో, అప్పటివరకూ సహజీవనం చేసిన పాత గర్ల్ ఫ్రెండ్ ను దారుణంగా హత్య చేసి, ముక్కలు ముక్కలుగా నరికి, ప్లాస్టిక్ సంచుల్లో కుక్కి ఫ్రిజ్ లో దాచిపెట్టి దొరికిపోయాడో అమెరికా యువకుడు. ఓహియోలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, యంగ్స్ టౌన్ సమీపంలో నివాసముండే అర్టురో నొవావో అనే యువకుడి ఇంటికి గత నెలలో కత్రినా లైటన్ అనే యువతి వచ్చింది. అప్పటికే షనాన్ గ్రేవ్స్ అనే యువతితో సహజీవనం చేసిన నొవావో, ఆమె స్థానంలో కత్రినాను తీసుకువచ్చాడు. షనాన్ జూన్ 22 నుంచి కనిపించకుండా పోయింది. ఈ విషయంలో పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

ఇక షనాన్ స్థానంలో నువావో ఇంటికి వచ్చిన కత్రినా, మాయమైన తన ప్రియుడి మాజీ స్నేహితురాలి వస్తువులన్నీ వాడటం మొదలు పెట్టింది. ఆమె సెల్ ఫోన్ ను, కారును వాడటంతో పాటు, ఆమె పెంచుకున్న కుక్క యోగక్షేమాలనూ చూస్తోంది.

ఇక, తన ఇంట్లో విద్యుత్ సమస్య ఉందని, ఫ్రిజ్ లో భారీగా మాంసం పేరుకుపోయిందని, దాన్ని పాడుచేయడం ఇష్టం లేదని, ఫ్రిజ్ ను బేస్ మెంట్ లో ఉంచాలని ఇంటి యజమానురాలిని అర్టురో నొవావో కోరాడు. ఆ ఫ్రిజ్ కు లాక్ చేసి ఉండటం, సాధారణ బరువుతో పోలిస్తే చాలా బరువుగా ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించగా, అసలు విషయం బయటపడింది. తీగ లాగిన పోలీసులు కత్రినాను, నువావోను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. షనాన్ మృతికి కారణమేంటన్న విషయం ఇంకా వెలుగులోకి రాలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News