: మంత్రుల నుంచి కార్యకర్తల వరకూ వెంటరాగా... భూమా బ్రహ్మానందరెడ్డి భారీ ర్యాలీ


నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన భూమా బ్రహ్మానందరెడ్డి ఈ ఉదయం నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీతో బయలుదేరారు. పలువురు మంత్రులు, పెద్ద ఎత్తున స్థానిక నేతలు, కార్యకర్తలు వెంటరాగా, భూమా నాగిరెడ్డి ఇంటి నుంచి ఆయన ర్యాలీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ర్యాలీ ప్రస్తుతం నంద్యాల పురవీధుల్లో ఉత్సాహంగా సాగుతోంది.

  • Loading...

More Telugu News