: టీడీపీకి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి!
నంద్యాల తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, అందరూ ఊహిస్తున్నట్టుగానే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఉదయం పార్టీకి రాజీనామా చేసిన ఆయన, తన కార్యకర్తలు, అనుచరుల సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. పార్టీలో తనకు ఎంతమాత్రమూ ప్రాతినిధ్యం దక్కలేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. కాగా, నిన్న ఆయన్ను బుజ్జగించేందుకు ఎంపీ సీఎం రమేష్, కాల్వ శ్రీనివాసులు ప్రయత్నించగా, తనకు శ్రీశైలం అసెంబ్లీ టికెట్ గ్యారెంటీగా ఇస్తామని చెబితే, పార్టీలో ఉంటానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అటువంటి హామీ ఇప్పటికిప్పుడు కోరవద్దని, ఎన్నికల ముందు ఇటువంటి డిమాండ్లు వద్దని వారు హితవు పలికి వెళ్లిపోయారు. ఆపై తన కార్యకర్తలతో సమావేశమైన శిల్పా, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుని, రాజీనామా వైపే మొగ్గు చూపారు