: ఆఫర్ల వెల్లువతో వచ్చేస్తోంది అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ సేల్'!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ సంవత్సరం 'గ్రేట్ ఇండియన్ సేల్' ను 9వ తేదీ అర్థరాత్రి 12 గంటల నుంచి 12వ తేదీ అర్థరాత్రి 11.59 గంటల వరకూ నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రతి సంవత్సరమూ తాము ప్రతిష్ఠాత్మకంగా దీన్ని నిర్వహిస్తున్నామని, ఈ సేల్ లో భాగంగా గతంలో ఎన్నడూ ఇవ్వనన్ని బ్లాక్ బస్టర్ డీల్స్ ను కస్టమర్ల ముందుకు తీసుకు వస్తున్నామని, ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేక డీల్స్ ఉంటాయని తెలిపింది. వీరి కోసం టాప్ డీల్స్ మిగతా వారితో పోలిస్తే 30 నిమిషాలు ముందే అందుబాటులో ఉంటాయని తెలిపింది.
అపెరల్, స్టోరేజ్ హోమ్ విభాగాల్లో 'అమెజాన్ పే బ్యాలెన్స్ ఓన్లీ డీల్స్' పేరిట 10 నుంచి 15 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తామని తెలిపింది. ఎస్బీఐ బ్యాంకు కార్డులను వినియోగించి యాప్ ద్వారా కొనుగోలు చేస్తే 15 శాతం, వెబ్ సైట్ ద్వారా అయితే 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తామని, యాప్ లో కొనుగోలు చేసే కస్టమర్లకు ట్రావెల్ ట్రిప్స్ ను బహుమతిగా అందిస్తామని పేర్కొంది. ఈమెయిల్ గిఫ్ట్ కార్డులపై 5 శాతం క్యాష్ బ్యాక్, బుక్ మై షో, క్లియర్ ట్రిప్ వంటి గిఫ్ట్ కార్డులపై 20 శాతం తగ్గింపును ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఆపిల్, వన్ ప్లస్, శాంసంగ్, యూఎస్బీ, ప్యూమా, అదిదాస్, రాంగ్లర్, టైటాన్, మార్క్స్ అండ్ స్పెన్సర్, అమెరికన్ టూరిస్టర్, లెనోవో, హెచ్పీ, మెకాఫీ తదితర కంపెనీల బ్రాండ్లపై ఆకర్షణీయ డీల్స్ ఉంటాయని వెల్లడించింది.