: హాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే!


హాలీవుడ్‌ లో హాట్ టాపిక్ పై చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు తారలు కలిసినా రియల్‌ ఎస్టేట్‌ డీలర్‌ బ్రూస్‌ మెకవ్‌ స్కీ సిద్ధం చేసిన భవంతి గురించి చర్చించుకుంటున్నారు. హాలీవుడ్ లో అత్యంత విలాసవంతమైన భవంతుల రూపశిల్పిగా రియల్ ఎస్టేట్ డీలర్ బ్రూస్ మెకవ్ స్కీకి మంచి పేరుంది. గత కొన్నేళ్లుగా బ్రూస్ మెకవ్ స్కీ హాలీవుడ్ లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పుకునే బెల్ ఎయిర్ ప్రాంతంలో నాలుగంతస్తుల భవంతిని నిర్మించాడు.

ఇందులో ప్రైవేటు హెలిప్యాడ్ సహా 12 పడక గదులు, 21 బాల్‌ రూమ్‌ లు, 3 కిచెన్‌ లు ఉన్నాయి. లివ్‌ ఇన్‌ చెఫ్‌ తో విక్రయానికి సిద్ధంగా ఉన్న ఈ భవంతి ధర సుమారు 250 మిలియన్ డాలర్లని అంచనా. ఇందులో అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంద్రభవనాన్ని తలపించే ఈ సుందర భవనాన్ని ఎవరు సొంతం చేసుకుంటారన్న చర్చ హాలీవుడ్ తారల్లో నడుస్తోంది. ఈ భవంతి వైశాల్యం 38 వేల చదరపు అడుగులు కావడం విశేషం. అద్భుతమైన ల్యాండ్ స్కేప్ తో ఆ భవంతి ఆకట్టుకుంటోంది. 

  • Loading...

More Telugu News