: 200 మంది యూనిట్ సభ్యులకు బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చిన తమిళ స్టార్!
కోలీవుడ్ అంతా ఇళయదళపతి అని ఎంతో ఇష్టంగా పిలుచుకునే స్టార్ హీరో విజయ్ తన ఉదారతను మరోసారి చాటుకున్నాడు. తన సినిమాకు పని చేసిన వారందరికీ చివర్లో ఏదో ఒక బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేసే విజయ్ 'మెర్ సల్' మూవీ యూనిట్ ను కూడా సర్ ప్రైజ్ చేశాడు. ఈ సినిమా కోసం పని చేసిన 200 మంది యూనిట్ సభ్యులకు బంగారు కాయిన్స్ ను బహుమతిగా అందజేశాడట. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. దీనికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందిస్తున్నాడు.