: ట్రాన్స్ జెండర్ కు పండంటి మగబిడ్డ!


ట్రాన్స్ జెండర్ ట్రైస్టాన్ రీస్, అతని పార్టనర్ బిఫ్ చాప్లోలు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అమెరికాలోని పోర్ట్ లాండ్ లోని ఒరెగాన్ లో మగబిడ్డ లియోకు జన్మనిచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో ట్రైస్టాన్ రీస్ గర్భం దాల్చి వార్తల్లోకి ఎక్కాడు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో సంచలనం రేకెత్తించిన విషయం విదితమే. అయితే, జులై 14న తమకు పండంటి మగబిడ్డ జన్మించాడంటూ వాళ్లు తమ ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు.

 ‘మా అందాల బిడ్డ జన్మించాడు!!! 9.5 పౌండ్స్ బరువు, 21.5 అంగుళాల పొడుగు ఉన్నాడు... మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నాము’ అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో వారు పేర్కొన్నారు. దీంతో పాటు, లియో ఫొటోనూ పోస్ట్ చేశారు. ఆ ఫొటోపై ‘వెల్ కమ్ లియో ముర్రే చాప్లో టూ ది వరల్డ్’ అనే క్యాప్షన్ రాశారు. ఈ సందర్భంగా ‘గ్లోబల్ న్యూస్’తో రీస్ మాట్లాడుతూ, ‘భూమిపై పడ్డ మా బిడ్డ తొలి శ్వాస తీసుకోవడం, ఏడుస్తున్న సంఘటన నా జీవితంలో నన్ను ఎంతో ఆశ్చర్యపరిచే సంఘటన. ఈ చిన్నారి కోసం నేను తపిస్తున్నాను.. నా శరీరం ఎంతో ప్రత్యేకత గలదే కాదు ఓ కానుక లాంటిది. ఎందుకంటే, శరీరంలో అవసరమైన మార్పులు చేసుకోవడం ద్వారా బిడ్డకు జన్మనివ్వడం జరిగింది..’ అని రీస్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా, గతంలో చాప్లో బంధువుల్లో ఇద్దరిని వీరు దత్తత తీసుకున్నారు. బయోలాజికల్ గా వారికి పుట్టిన మొదటి సంతానం లియో.

  • Loading...

More Telugu News