: న్యూస్ రూమ్ లోకి చొరబడ్డ పాము.. ధైర్యంగా సంచిలో కుక్కిన మహిళా ఉద్యోగి!


ఓ పాము ఎలా వచ్చిందో ఏమో కాని ఓ వార్తా ఛానల్ న్యూస్ రూమ్ లోకి వచ్చి చేరింది. కంప్యూటర్ డెస్క్ పైకి చేరిన ఆ పాము... స్పీకర్ వెనుక నక్కింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని '9 న్యూస్ డార్విన్' ఛానల్ లో చోటు చేసుకుంది. న్యూస్ రూమ్ లో ఉన్న పామును ముందు ఓ కెమెరామెన్ గమనించాడు. వెంటనే ఆ సమాచారాన్ని ఇతరులకు అందించాడు. ఈ నేపథ్యంలో ఓ మహిళా ఉద్యోగి ధైర్యంగా అక్కడకు వచ్చి, ఆ పామును పట్టుకొని ఓ సంచిలో వేసింది. మధ్యలో ఆ పాము ఎదురుతిరిగే ప్రయత్నం చేసినప్పటికీ... ఆమె భయపడలేదు. అయితే ఆమెకు పాములు పట్టడంలో నైపుణ్యం ఉందని ఛానల్ సిబ్బంది తెలిపారు.

  • Loading...

More Telugu News