: రేప్ కు గురైన యువకుడు...కూలి పనులు ఇప్పిస్తానంటూ అఘాయిత్యం
సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోట తాలూకాలోని నంజనయ్య కాలనీకి చెందిన మణి అనే వ్యక్తి దురలవాట్లకు బానిసయ్యాడు. ఐదు రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన రాచప్ప అనే యువకుడికి కూలీ పనులు ఇప్పిస్తానని నమ్మించి, వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అతనిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
దీంతో తీవ్రవేదన అనుభవించిన రాచప్ప, నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించగా, అతనికి చికిత్స చేసిన వైద్యులు విషయం గుర్తించి, రాచప్ప తల్లికి విషయం చెప్పారు. దీంతో నిర్ఘాంత పోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారించి, నిందితుడు మణిని అదుపులోకి తీసుకున్నారు.