: 'బిగ్ బాస్' పారితోషికంలో కొంత మొత్తాన్ని క్యాన్సర్ తో బాధపడుతున్న 'అల్లరి సుభాషిణి'కి ఇచ్చిన నటి జ్యోతి!
ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్'లో తొలివారంలోనే ఎలిమినేట్ అయిన నటి జ్యోతి, తనకు అందిన పారితోషికంలో రూ. 50 వేలను క్యాన్సర్ తో బాధపడుతున్న నటి అల్లరి సుభాషిణికి ఇచ్చి తన మంచి మనసును చాటుకుంది. తొలుత చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఎలిమినేట్ అయినప్పటికీ, ఆమెకు భారీ మొత్తంలోనే డబ్బు అందినట్టు తెలుస్తుండగా, అందులో కొంత మొత్తాన్ని ఓ మంచి పనికి ఖర్చు చేయాలని భావిస్తున్నానని, ఏదైనా సలహా ఇవ్వాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజాని ఆమె కోరినట్టు తెలుస్తోంది. అల్లరి సుభాషిణికి ఇచ్చి ఆమెకు సహకరించాలని శివాజీరాజా సలహా ఇవ్వగా, వెంటనే రూ. 50 వేలను ఆమెకు ఇచ్చింది జ్యోతి.