: మా వాడి పెళ్లెప్పుడంటే..!: పరిటాల సునీత క్లారిటీ


తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల రవి, ఏపీ మంత్రి పరిటాల సునీతల కుమారుడు శ్రీరామ్ వివాహంపై క్లారిటీ వచ్చేసింది. గత కొంత కాలంగా ఆయన పెళ్లిపై చర్చలు సాగుతుండగా, పరిటాల సునీత స్వయంగా కుమారుడి పెళ్లిపై ఓ ప్రకటన చేశారు. అక్టోబర్ 1న శింగనమల నియోజకవర్గం నార్పల మండలంకు చెందిన ఏవీఆర్‌ కన్‌ స్ట్రక్షన్స్‌ అధినేత ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె ఆలం జ్ఞానతో వివాహం జరుగుతుందని కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 10న హైదరాబాద్ లో నిశ్చితార్థం చేసుకుంటామని ఆమె చెప్పడంతో, తమ నేత ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న ఆనందం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.

  • Loading...

More Telugu News