: ల్యాండ్ అవుతూ పేలిన ఎతిహాద్ ఎయిర్ వేస్ విమానం టైరు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు


ఎతిహాద్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన విమానం రన్ వే పై ల్యాండవుతుండగా టైర్ పేలిపోయిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో అబుదాబి నుంచి సిబ్బంది సహా 200 మందితో ప్రయాణమైన ఎతిహాద్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం ల్యాండ్ అవుతున్నసమయంలో ముందరి వీల్ టైర్ పేలిపోయింది. దీంతో రన్ వేపై విమానం అదుపుతప్పింది.

అయితే ఎయిర్ కంట్రోల్ సాయంతో పైలట్ విమానాన్ని సురక్షితంగా రెండో రన్ వేపై ల్యాండ్ చేశారు. దీంతో విమానంలో ప్రయాణికులు భారీ కుదుపుకు లోనయ్యారు. దీంతో ఒక్కసారిగా అందర్లోనూ ఆందోళన నెలకొంది. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో గమ్యం చేరిన ప్రయాణికులు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఇంజనీరింగ్ సిబ్బంది టైరు మారుస్తారని వారు తెలిపారు. 

  • Loading...

More Telugu News