: దొంగతో తనకు వివాహేతర సంబంధాన్ని అంటగడుతున్నారంటూ ఆత్మహత్యకు యత్నించిన మహిళ!
దొంగతో తనకు వివాహేతర సంబంధం అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ఒక మహిళ డీజీపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన సోనీ అనే మహిళ హైదరాబాదులోని డీజీపీ కార్యాలయనికి వచ్చింది. ఒక దొంగతో తనకు వివాహేతర సంబంధం ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎస్సై రామ్ చరణ్ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
దీనిపై గతంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. ఎస్సై వేధింపులు తాళలేకపోతున్నానని ఆరోపిస్తూ ఆమె తనతో తెచ్చుకున్న ఫినాయిల్ తాగింది. దీనిని గమనించిన సిబ్బంది ఆమెను ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.