: 72 ఏళ్ల బామ్మ... డ్యాన్స్ అదరగొట్టింది... వీడియో చూడండి
కొంతమందికి వయసు కేవలం సంఖ్య మాత్రమే అనే విషయాన్ని ఈ బామ్మ మరోసారి రుజువు చేసింది. 72 ఏళ్ల వయసులో మరాఠి సినిమా `సైరట్`లోని `జింగాట్` పాటకు స్టేజీ అదిరిపోయేలా డ్యాన్స్ వేసి అందరినీ ఆకట్టుకుంది. ఆమె పేరు సుశీలా బాయ్ దివాల్కర్. మరాఠి చిత్ర సీమలో కొరియాగ్రాఫర్‌గా పనిచేసిన ఆమె ప్రతిరోజు డ్యాన్స్ చేయడం వల్లే తను ఇంత ఫిట్‌గా ఉన్నానని చెప్పింది. పూణెలో జరిగిన ఓ డ్యాన్స్ అకాడమీ కార్యక్రమంలో ఆమె ఇలా తన డ్యాన్స్‌ను ప్రదర్శించింది.