: కశ్మీర్ లో బ్యాంకును లూటీ చేసిన దుండగులు!


కశ్మీర్ లో ముగ్గురు దుండగులు బ్యాంకును లూటీ చేసిన ఘటన చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా కేంద్రంలోని జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకుకు చెందిన శాఖలోకి ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు తుపాకులతో సెక్యూరిటీని బెదిరించి ప్రవేశించారు. బ్యాంకు ఉద్యోగులకు తుపాకులు గురిపెట్టి సహకరించాలని కోరారు. అనంతరం బ్యాంకు లాకర్లలోని నగదు మొత్తాన్ని దోచుకెళ్లిపోయారు. అనంతరం బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించగా, బ్యాంకు ఉద్యోగులు ఎంత మొత్తం దోపిడీకి గురైందన్నది లెక్కలు చూడడంలో మునిగిపోయారు. 

  • Loading...

More Telugu News