: అవినీతి తిమింగలాలపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం.. తయారవుతున్న చిట్టా!


అవినీతిని అంతమొందించాలని ప్రధాని మోదీ కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో, అవినీతిపై ఉక్కుపాదం మోపే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతికి పాల్పడ్డ, అవినీతి మచ్చ పడ్డ అధికారుల జాబితాను సిద్ధం చేసే పనిలో మోదీ ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రతి శాఖలో ఉన్న అవినీతి అధికారుల చిట్టాను తయారుచేసే పనిలో ఆయా శాఖల్లోని విజిలెన్స్ డిపార్ట్ మెంట్ ఇప్పటికే తలమునకలై ఉంది. ఈ జాబితాల్లో ఉండే అధికారులపై ఆగస్టు 15వ తేదీ తర్వాత కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

అధికారుల సర్వీస్ రికార్డుల ఆధారంగా సదరు అవినీతి అధికారుల జాబితాను కేంద్ర హోం శాఖ తయారు చేయిస్తోంది. పలు శాఖలకు, పారా మిలిటరీ దళాల విభాగాలకు ఇప్పటికే కేంద్ర హోం శాఖ లేఖలు రాసింది. ఆగస్టు 5వ తేదీలోగా అవినీతి అధికారులు చిట్టాను తయారు చేయాలని ఆదేశించింది. తన వద్దకు వచ్చిన అవినీతి అధికారుల చిట్టాను కేంద్ర హోం శాఖ సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు పంపనుంది. ఈ ఏజెన్సీలు వీరిపై విచారణ జరిపిన అనంతరం... అవినీతి తిమింగలాలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News