: చైనా పౌరుడిపై బెంగళూరులో దాడి!
భారత్-చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భంలో, వీటిని మరింత పెంచే ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఐదుగురు వ్యక్తులు యాన్ అనే చైనా పౌరుడిపై దాడికి పాల్పడ్డారు. ఓ బిజినెస్ డీల్ కుదుర్చుకునేందుకు ఈయన చైనా నుంచి బెంగళూరుకు వచ్చారు. నగరంలోని ఇందిరానగర్ లో ఆయన క్యాబ్ కోసం వేచి చూస్తున్న సమయంలో, అక్కడకు వచ్చిన దుండగులు ఆయన వద్ద ఉన్న వస్తువులను దోచుకెళ్లడానికి ప్రయత్నించారు.
యాన్ ప్రతిఘటించడంతో, కత్తులతో అతని ముఖంపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో, యాన్ గట్టిగా కేకలు పెట్టారు. దీంతో, దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనలో యాన్ ముఖానికి గాయమైంది. అక్కడకు చేసుకున్న స్థానికులు చైనా వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.