: బాణసంచా తయారీ గోడౌన్‌లో పేలుడు.. ఇద్దరి మృతి.. ఉలిక్కిపడ్డ తిరుపతి


తిరుపతి-రేణిగుంట మార్గంలోని పద్మావతి నగర్‌లో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో ఇద్దరు మైనర్లు మృతి చెందారు. ఆదివారం ఇద్దరు బాల కార్మికులు, ఓ యువతి బాణసంచా తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో బాలుడు బయటకు వచ్చిన తర్వాత కుప్పకూలి మృతి చెందాడు. తీవ్ర గాయాలతో యువతి ధనలక్ష్మి (18) బయటపడింది. ఆమెను వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన బాలురను మంజు (13), మణికంఠ (14)గా పోలీసులు గుర్తించారు. ఖల్‌నాయక్ అనే వ్యక్తి ఇక్కడ గోడౌన్‌ను అద్దెకు తీసుకుని అక్రమంగా బాణసంచా తయారుచేస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు దెబ్బతిన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
 

 






  • Loading...

More Telugu News