: వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ చండీయాగం.. ఫలితాలు వెల్లడయ్యే వరకు కొనసాగింపు!


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘గెలుపు’ యాగం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా ప్రారంభమైన యాగం ఫలితాలు వెల్లడయ్యే వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ మలక్‌పేటలోని వేద పండితుడు శివరామ ప్రసాదశర్మ నివాసంలో ‘శ్రీ మహారుద్ర సహిత సహస్ర చండీయాగం’ ప్రారంభమైంది. వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి శనివారం యాగ సంకల్పం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే లోపు ఓసారి జగన్ పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అలాగే ఫలితాలు వచ్చాక నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమానికి కూడా జగన్ హాజరుకానున్నట్టు సమాచారం. అధికారం కోసం రెండేళ్ల ముందే జగన్ యాగం ప్రారంభించడం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

  • Loading...

More Telugu News