: నీకు మాట్లాడడమే రాదు.. నువ్వు జర్నలిస్టువెలా అయ్యావు? : టీవీ యాంకర్ ను అయోమయంలో పడేసిన హేమ
పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన టీవీ ఛానెల్ యాంకర్ ను సినీ నటి హేమ అయోమయంలో పడేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఒక న్యూస్ ఛానెల్ లో ముఖాముఖి పేరుతో ఒక కార్యక్రమం ప్రసారమవుతుంది. అందులో భాగంగా ఇంటర్వ్యూ చేసే యాంకర్ జాఫర్ ను హేమ ప్రశ్నిస్తూ... ఒక సందర్భంలో సినీ నటుడు సునీల్ అందంగా ఉండడని, హీరోగా సక్సెస్ అవుతాననుకున్నారా? అని అడిగారని, సరిగ్గా మాట్లాడడం కూడా రాని మీరు సక్సెస్ ఫుల్ జర్నలిస్టు అవుతానని ఊహించారా? అని ప్రశ్నించారు. దానికి ఆ యాంకర్ ఒక్క క్షణం ఆయోమయానికి గురై నవ్వేశారు. దీంతో హేమ కూడా నవ్వేసి వాతావరణం తేలికపరిచారు.