: సినీ పరిశ్రమలో ఒకప్పుడు వేధింపులుండేవి... నాకు మాత్రం ఎదురవ్వలేదు: సినీ నటి హేమ
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తాను ఎప్పుడూ చెప్పలేదని సినీ నటి హేమ పేర్కొంది. పవన్ అందరి వాడినని చెప్పుకుంటున్నాడని ఆమె చెప్పింది. ముద్రగడ పద్మనాభం పోరాటం నచ్చి తాను అయనతో కలిశానని చెప్పింది. తాను ముక్కు సూటిగా ఉంటానని ఆమె తెలిపింది. సినిమాల్లో ఉంటూనే నిర్మాత, దర్శకులను ప్రశ్నించిన వ్యక్తిని తానేనని ఆమె చెప్పింది.
సినీ పరిశ్రమలో పాత్ర కావాలంటే చాలా త్యాగాలు చెయ్యాలని ఒకప్పుడు ఉండేదని, ఇప్పుడైతే అలాంటిదేదీ లేదని ఆమె తెలిపింది. తాను 14 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి వచ్చానని, తాను మాత్రం అలాంటి వేధింపులు ఎదుర్కోలేదని చెప్పింది. ఇప్పుడున్న సినీ పరిశ్రమలో నీకు, నాకు (ఇద్దరు వ్యక్తులకు) నచ్చితే ఏదైనా చేయవచ్చని హేమ చెప్పింది. ఇప్పుడు దర్శకులు విద్యావంతులని, అందుకే పాత పద్ధతులు మారాయని హేమ తెలిపింది.