: ఆ కపాలం ఏలియన్ ది కాదు...పిల్లాడిది: రష్యా పురావస్తు శాస్త్రవేత్తలు


క్రిమియాలోని శ్మశానం గుండా బ్రిడ్జ్ ని నిర్మించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదేశించడంతో బ్రిడ్జ్ కోసం తవ్వకాలు జరుపుతుండగా ఒక ఆస్థిపంజరం కనిపించింది. దానిని బయటకు తీసేందుకు సున్నితమైన బ్రష్‌ లను ఉపయోగించారు. పూర్తిగా బయటపడిన ఆస్థిపంజరాన్ని చూసిన పురావస్తు శాస్త్రవేత్తలు షాకయ్యారు. దాని తల ఏలియన్‌ తలను పోలి ఉంది. దీంతో అది ఏలియన్ తలా? మనిషి తలా? అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి.

అయితే అది ఏలియన్ తల కాదని, 2000 ఏళ్ల క్రితం యుద్ధరంగంలో పోరాడిన ఓ పిల్లాడి కపాలమని రష్యా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2000 ఏళ్ల క్రితం యుద్ధానికి పంపే సమయంలో విజయం కోసం కొన్ని కృత్రిమ పద్ధతులు అనుసరించేవారని, అందులో భాగంగా పిల్లల కపాలాన్ని సాగదీసేవారని వారు తెలిపారు. ఈ ప్రక్రియలో పిల్లలు భరించరాని బాధను అనుభవించేవారని వారు తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించని పలువురు ఆ కపాలం ఏలియన్స్ దేనని పేర్కొంటున్నారు. 

  • Loading...

More Telugu News