: నేను ప్రభుత్వాలకు కాదు... ప్రజలకు సేవ చేస్తాను!: పవన్ కల్యాణ్


'నేను ప్రభుత్వాలకు కాదు...ప్రజలకు సేవ చేస్తా'నని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. విశాఖపట్టణంలో జరిగిన సింపోజియంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ, మన తోటి మనుషులు బాధపడుతుంటే పరిష్కారం వెదక్కుండా రాజకీయాలు చేయడం దారుణమని అన్నారు. సమస్యను స్పష్టంగా వేలెత్తి చూపుతున్నప్పుడు దానిని పరిష్కరించకుండా విమర్శలు చేసుకుంటుండడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

ఉద్ధానం ప్రజల సమస్యలను పరిష్కరించాలని పవన్ సూచించారు. ఇలాంటి సమస్యల పరిష్కారంలో తాను నిపుణుడ్ని కాదని, అయితే మనిషిగా, తోటి మనిషి కష్టంలో భాగం పంచుకోవాలని చూసే వ్యక్తినని అన్నారు. ఎంతో మంది నిపుణులు, మేధావులు, పరిశోధకులు కలిసి ఈ సమస్యను పరిష్కరించలేరా? అని ప్రశ్నించారు. ఇలాంటి సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే దానిని నివారించడం పెద్ద కష్టం కాదని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎంతో కాలంగా వేధిస్తోందని, దాని పట్ల చిత్తశుద్ధితో స్పందిస్తే విమర్శలు చేశారని గుర్తు చేశారు. అయితే ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుందని భావించి ఈ విషయంలో స్పందించానని అన్నారు. 

  • Loading...

More Telugu News