: బీచ్ కారిడార్ ప్రారంభించిన చిరంజీవి
కేంద్ర మంత్రి చిరంజీవి తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. భారత పర్యాటక రంగంపై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ పర్యాటక సదస్సు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించడం నుంచి బెర్లిన్ టూరిజం ఫెస్టివల్లో భారత పర్యాటకం ఘనతను విజయవంతంగా వివరించడం వరకు ఆయన ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. తాజాగా, రాష్ట్రంలో విశాఖ-భీమిలి బీచ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ. 45 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా విశాఖ నుంచి భీమిలి వరకు తీరప్రాంతాన్ని పర్యాటకానికి అనువుగా తీర్చిదిద్దుతారు.