: విశాఖలో మొదలైన పవన్ కల్యాణ్ ర్యాలీ!
ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితుల సమస్యకు కారణాలను తెలుసుకునేందుకు వచ్చిన హార్వార్డ్ శాస్త్రవేత్తల బృందాన్ని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ చేరుకోగా, ఆయనకు అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఆపై అభిమానులతో కలసి పవన్ ర్యాలీగా బయలుదేరారు. మరి కాసేపట్లో ర్యాలీ పోతన మల్లయ్యపాలెం సమీపంలోని కన్వెన్షన్ సెంటర్ కు చేరుకోనుండగా, ఉద్ధానం సమస్యలపై వైద్యలు, హార్వర్డ్ ప్రొఫెసర్లతో పవన్ భేటీ అయి చర్చలు జరపనున్నారు.
కాగా, ఇప్పటికే కిడ్నీ వ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో వైద్య బృందం పర్యటనలు జరిపిన సంగతి తెలిసిందే. వైద్య బృందంతో చర్చల అనంతరం, రేపు వారితో కలసి సీఎం చంద్రబాబును పవన్ కలవనున్నారు. వారిచ్చే సూచనలను చంద్రబాబుకు తెలిపి, వాటి అమలుకు చర్యలు చేపట్టాలని సూచించనున్నారు.