: డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో మధ్యప్రదేశ్‌లోని అధికార బీజేపీ నేతకు ఐదేళ్ల జైలు
2011 నాటి ఓపియమ్ (నల్లమందు) అక్రమ రవాణా కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత, మందసౌర్ జిల్లా పంచాయత్ చైర్మన్ అయిన గుణ్వంత్ పటీదార్‌కు ప్రత్యేక కోర్టు శనివారం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 1.5 కేజీల నల్లమందు అక్రమ రవాణా కేసులో గుణ్వంత్‌ను దోషిగా తేల్చిన కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.75 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
మానసిక ఆరోగ్యం కారణంగా చూపి, కేసును విచారణను గుణ్వంత్ అడ్డుకో చూశారని ప్రభుత్వ న్యాయవాది కృష్ణన్ పేర్కొన్నారు. ఓపియమ్ అక్రమ రవాణా కేసులో గుణ్వంత్ దోషిగా తేలడం అధికార బీజేపీకి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.