: 'ఈ మాత్రం డ్రగ్స్ వాడక తప్పదు' అన్న దర్శకుడు... వద్దని వారించినా వాడాడన్న హీరో!
డ్రగ్స్ దందాలో ఎక్సైజ్ సిట్ జరుపుతున్న విచారణలో భాగంగా, తాము విచారించిన దర్శకుడికి వ్యతిరేకంగా పలు సాక్ష్యాలను సంపాదించామని చెబుతున్నారు. విచారణలో పాల్గొన్న ఓ ప్రముఖ హీరో సాక్ష్యం కీలకమని అంటున్నారు. ఆయన డ్రగ్స్ తెప్పించుకుని వాడేవారని, దీన్ని చాలాసార్లు చూశామని, తాను వద్దని చెబితే, "పని ఒత్తిడి నుంచి బయట పడాలంటే, ఆ మాత్రం తప్పదు. కావాలంటే చెప్పండి మీకూ ఇస్తాను" అని ఆయన ఆఫర్ ఇచ్చాడని చెప్పాడు. తాము వద్దని వారించామని, అయినా అతను వాడేవాడని చెప్పాడు.
వాస్తవానికి డ్రగ్స్ అమ్మి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఆయనకు లేదని చెప్పిన సదరు హీరో, ఇండియాలో షూటింగులు ఉంటే పెద్దగా డ్రగ్స్ వినియోగించని ఆయన, విదేశాల్లో ఉంటే ఎక్కువగా వాడతారని, తెప్పించిన మత్తుమందుల్లో కొంత తాను ఉంచుకుని, మిగతాది పక్కవారికి అందించేవారని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ దర్శకుడికి వ్యతిరేకంగా లభ్యమైన సాక్ష్యాల్లో ఈ హీరో చెప్పిన సాక్ష్యం రెండోదని సిట్ వర్గాలు అంటున్నాయి. అతనితో కలసి పని చేసిన మరో ప్రముఖుడు సైతం దర్శకుడు డ్రగ్స్ వాడుతుండగా తాను చూశానని చెప్పగా, అతన్ని కూడా విట్ నెస్ గా నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ, అతనిపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తోంది.