: వైజాగ్ హెచ్పీసీఎల్ లోని క్రూడాయిల్ ట్యాంక్ పై పడిన పిడుగు.. ఎగసిపడుతున్న మంటలు


విశాఖపట్టణంలోని హెచ్పీసీఎల్‌ లో పిడుగుపడింది. నేటి సాయంత్రం వైజాగ్ లో వర్షం కురిసింది. ఈ వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. అందులో ఒక పిడుగు హెచ్పీసీఎల్ లో భారీగా క్రూడాయిల్‌ నిల్వ ఉంచిన ట్యాంకుపై పడింది. దీంతో ఆ ట్యాంక్ కు నిప్పంటుకుని, ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.

వైజాగ్ లోని అగ్నిమాపక శకటాలతో సిబ్బంది హెచ్పీసీఎల్ కు చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, కాసేపట్లో మంటలను అదుపులోకి తెస్తామని హెచ్పీసీఎల్ వర్గాలు తెలిపాయి. కాగా, గతంలో హెచ్పీసీఎల్ లో జరిగిన ప్రమాదంలో తీవ్రప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఆ నాటి చేదు అనుభవం ఇంకా నగరవాసులను వీడకపోవడంతో హెచ్పీసీఎల్ లో అగ్ని ప్రమాదం అనగానే అందోళనలో పడ్డారు. 

  • Loading...

More Telugu News