: తెలంగాణ విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త?


విద్యుత్ శాఖలో ఏళ్ల తరబడి ఔట్ సోర్సింగ్ కార్మికులుగా పని చేస్తున్న కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ కార్మికులుగా పని చేస్తున్న సుమారు 20,094 మందిని క్రమబద్ధీకరించేందుకు లైన్ క్లియర్ అయింది. విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించే ఫైల్ పై చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ సంతకం చేశారు. వెంటనే ఈ ఫైల్ ను ఆమోదించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెంతకు పంపారు. ఆయన సంతకం చేసిన వెంటనే ఆదేశాలు జారీ చేస్తారు. 

  • Loading...

More Telugu News